English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

1 Chronicles Chapters

1 (1-3) దాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు. [*ఆదాము … నోవహు ఒకటి నుండి నాలుగవ వచనం వరకు వంశ పరంపర పేర్లు. అనగా ఒక వంశ కర్త పేరు, అతని కుమారుడు లేక కుమారుల పేర్లు.]
4 షేము, హాము, యాపెతు.
5 యాపెతు కుమారులెవరనగా: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు మరియు తీరసు.
6 అష్కనజు, రీఫతు, తోగర్మాలనేవారు గోమెరు కుమారులు.
7 ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము [†రోదానీము దోదానీము అని పాఠాంతరం.] అనేవారు యావాను కుమారులు.
8 కూషు, (ఇథియోపియ) మిస్రాయిము, (ఈజిప్టు) పూతు మరియు కనాను అనేవారు హాము కుమారులు.
9 సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా అనేవారు కూషు కుమారులు. షెబ, దదాను అనేవారు రాయమా కుమారులు.
10 నిమ్రోదు అనువాడు కూషు సంతతివాడు. నిమ్రోదు ప్రపంచంలోనే మహా ధైర్యవంతుడు, బలవంతుడైన సైనికుడయ్యాడు.
11 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు వీరందరికి మిస్రాయిము (ఈజిప్టు) వంశకర్త.
12 అంతేకాదు, పత్రుసీయులకు, కస్లూహీయులకు మరియు కఫ్తోరీయులకు కూడ మిస్రాయిము వంశకర్త. ఫిలిష్తీయులు (పాలస్తీను ప్రజలు) కస్లూహునుండి వచ్చినవారు.
13 కనాను పెద్ద కుమారుని పేరు సీదోను, రెండవ కుమారుడు హేతు. మరియు హిత్తీయులకు
14 యెబూసీయులకు, అమోరీయులకు, గిర్గాషీయులకు,
15 హివ్వీయులకు, అర్కీయులకు, సీనీయులకు,
16 అర్వాదీయులకు, సెమారీయులకు మరియు హమాతీయులకు కూడ కనాను వంశకర్త.
17 షేము కుమారులు ఎవరనగా: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు మరియు అరాము. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు మరియు మెషెకు. [‡మెషెకు లేక “మాషు” ఆది. 10:23 చూడండి.]
18 అర్పక్షదుకు షేలహు అను కుమారుడు పుట్టాడు. షేలహునకు ఏబెరు అనువాడు పుట్టాడు.
19 ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు పెలెగు. [§పెలెగు అనగా విభజన.] అతని కాలంలో ప్రపంచ జనాభా వివిధ భాషా వర్గాలుగా విడిపోయిన కారణంగా అతనికి పెలెగు అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. (
20 అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21 హదోరము, ఊజాలు, దిక్లాను,
22 ఏబాలు, అబీమాయేలు, షేబ,
23 ఓఫీరు, హవీలా మరియు యోబాబు. వీరంతా యొక్తాను కుమారులు.)
24 అబ్రాహాము సంతానం ఎవరనగా: షేము, అర్పక్షదు, షేలహు,
25 ఏబెరు, పెలెగు, రయూ,
26 సెరూగు, నాహోరు, తెరహు,
27 మరియు అబ్రాహాము పేరుతో పిలవబడిన అబ్రాము.
28 అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు.
29 ఇష్మాయేలు సంతానం ఎవరనగా: ఇష్మాయేలు ప్రథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర కుమారులెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్శాము,
30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
31 యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.
32 కెతూరా అబ్రాహాముకు దాసి. [*దాసి ఉంపుడు గత్తె లేక ఉపపత్ని అని పాఠాంతరం.] ఆమెకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు మరియు షూవహు అను కుమారులు కలిగారు. యొక్షానుకు షేబ, దదాను అను కుమారులు పుట్టారు.
33 ఏయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతతివారు.
34 ఇస్సాకు తండ్రి పేరు అబ్రాహాము. ఇస్సాకు కుమారుల పేర్లు ఏశావు, ఇశ్రాయేలు. [†ఇశ్రాయేలు యాకోబనకు ఇది మరో పేరు. ఆది. 32:28 చూడండి.]
35 ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు.
36 తేమాను, ఓమారు, సెపో, [‡సెపో లేక జెఫి.] గాతాము, కనజు, తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమారులు.
37 నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు.
38 లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు మరియు దిషోను అనువారంతా శేయీరు కుమారులు.
39 హోరీ, హోమాను [§హోమాను హోమాము అని పాఠాంతరం. ఆది. 36:22 చూడండి.] ఇరువురూ లోతాను కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి.
40 అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము అనువారు శోబాలు కుమారులు. అయ్యా, అనా అను వారిరువురూ సిబ్యోను కుమారులు.
41 అనా కుమారుని పేరు దిషోను. అమ్రాము, ఎష్బాను, ఇత్రాను, కెరాను అనువారు దిషోను కుమారులు.
42 బిల్హాను, జవాను, యహకాను అనువారు ఏసెరు కుమారులు. ఊజు, అరానులిరువురూ దిషాను కుమారులు.
43 ఎదోము రాజుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు. వీరు ఎవరనగా బెయారు కుమారుడైన బెల, అతని నగరం పేరు దిన్హాబా.
44 బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు.
45 యోబాబు చనిపోయిన తరువాత హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీయుల దేశపువాడు.
46 హుషాము చనిపోయిన పిమ్మట హదదు రాజయ్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు అవీతు నగరంవాడు.
47 హదదు చనిపోగా శమ్లా రాజయ్యాడు. ఇతడు మశ్రేకా నగరవాసి.
48 శమ్లా చనిపోయిన పిమ్మట షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ తీరానగల రహెబోతు పట్టణపు వాడు.
49 షావూలు మరణానంతరం బయల్ — హానాను రాజయ్యాడు. బయల్ — హానాను తండ్రి పేరు అక్బోరు.
50 బయల్ — హానాను చనిపోగా హదదు అతని స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు పాయు. [*పాయు లేక పాయి. ఆది 36:39 చూడండి.] హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె.
51 కొంత కాలానికి హదదు చనిపోయాడు. అప్పట్లో ఎదోము రాజ్యంలో తిమ్నా, అల్వాయతేతు,
52 అహలీబామా, ఏలా, పీనోను,
53 కనజు, తేమాను, మిబ్సారు,
54 మగ్దీయేలు మరియు ఈరాము నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ నాయకులు.
×

Alert

×